Shivam Dube : యువీ, కోహ్లీ తర్వాత ఆ ఘనత సాధించింది దూబెనే..

అఫ్గాన్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగుతున్న శివమ్‌ దూబె(Shivam Dube).. భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 16 Jan 2024 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గాయంతో జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్థానాన్ని భర్తీ చేసేలా శివమ్‌ దూబె(Shivam Dube) కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌(T20 world cup 2024) ముందు టీమ్‌ఇండియా(TeamIndia) ఆడుతున్న ఏకైక సిరీస్‌(IND vs AFG)లో అదరగొడుతున్నాడు. అఫ్గానిస్థాన్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రెండు అర్ధ శతకాలు సాధించి.. రెండు వికెట్లూ పడగొట్టాడు. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా సిరీస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

పంత్‌ ఎప్పటికి వస్తాడో?

టీ20 మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి.. కనీసం ఒక వికెట్‌ పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో దూబె దూసుకెళ్తున్నాడు. తొలి టీ20లో రెండు ఓవర్లు వేసి.. ఒక వికెట్‌ సాధించాడు. అటు బ్యాట్‌తో అజేయంగా 60 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. అప్పుడే తొలిసారి ఈ జాబితాలో అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక రెండో టీ20లోనూ ఒక వికెట్‌ సాధించి.. 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇలాంటి ప్రదర్శన చేసిన మూడో ఆటగాడు దూబె. యువరాజ్‌ మూడుసార్లు, విరాట్‌ కోహ్లీ రెండుసార్లు ఈ రికార్డు సృష్టించారు. హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కోసారి సాధించారు.

జట్టుకు హార్దిక్‌ దూరం కావడంతో దొరికిన అవకాశాన్ని శివమ్‌ చక్కగా అందిపుచ్చుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలవడం విశేషం. తనదైన శైలిలో సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని