CSK vs RCB: ఇదే బిగ్‌ గేమ్‌.. చెపాక్‌లో ధోనీని కలవడం ఇంకా స్పెషల్: విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో (IPL 2024) తొలి మ్యాచ్‌ పెద్ద జట్ల మధ్యే జరగనుంది. ఇప్పటికే ఇరు టీమ్‌లూ సిద్ధంగా ఉన్నాయి.

Updated : 22 Mar 2024 13:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో (IPL 2024) చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ధోనీతో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పాడు. క్రికెట్‌ను అభిమానించే చెపాక్‌ ప్రేక్షకుల మధ్య ఆడటం మరింత స్పెషల్ అని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇది అతిపెద్ద మ్యాచ్‌గా నిలిచిపోతుందని చెప్పాడు. ‘‘చెన్నైతో ఆడటం అభిమానులకే కాకుండా క్రికెటర్లుగా మాకూ ఆనందంగా ఉంటుంది. ధోనీని కలవబోతున్నా. ఇది కూడా ప్రత్యేకమే. చెన్నై అభిమానులు క్రికెట్‌ పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.

తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు దిగ్గజాలు: డుప్లెసిస్

‘‘ఐపీఎల్‌ మొదటి వారంలో కీలకమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మా జట్టు సన్నద్ధత కోసం సహాయక సిబ్బంది చాలా కష్టపడ్డారు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య పోరును చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌ అన్నాడు.

ఆర్సీబీ సారథితో ఏం మాట్లాడానంటే..?: రుతురాజ్‌ 

‘‘ఆర్సీబీతో మేం తొలి మ్యాచ్‌ ఆడబోతున్నాం. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి డుప్లెసిస్‌తో సంభాషించా. మేమిద్దరం కలిసి కొన్నాళ్లు సీఎస్కేకు ఆడాం. ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడుతూ ఆ జట్టును డుప్లెసిస్‌ నడిపిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్‌గా అతడితో కలిసి టాస్‌ వేసేందుకు వెళ్లనున్నా. ఇది నా జీవితంలో అద్భుతమైన తొలి మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా’’ అని సీఎస్కే సారథి రుతురాజ్‌ గైక్వాడ్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని