Virat Kohli: మరో రెండు రికార్డులకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీని (Virat Kohli) ఐపీఎల్‌లో మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం వాటికి కోహ్లీ కేవలం అడుగు దూరంలోనే ఉన్నాడు. ఈ సీజన్‌లోనే వాటిని సాధించే అద్భుత అవకాశం అతడి ముందు ఉంది. ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్‌లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) తరఫున 12 ఇన్నింగ్స్‌ల్లో 548 రన్స్‌తో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 9,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌లో 8,552 పరుగులు చేసిన కోహ్లీ, సీఎల్‌టీ20 (ఛాంపియన్ లీగ్ టీ20)లో 14 ఇన్నింగ్స్‌లో 424 రన్స్ సాధించాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున 270 ఇన్నింగ్స్‌ల్లో 8,976 పరుగులు చేశాడు. ఈ మైలురాయిని బుధవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జరిగే మ్యాచ్‌లోనే సాధించే అవకాశం ఉంది.
అలాగే విరాట్ కోహ్లీ మరో అర్ధశతకం బాదితే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 62 అర్ధశతకాలతో డేవిడ్ వార్నర్‌తో (David Warner) సమానంగా ఉన్నాడు. విరాట్ ఈ సీజన్‌లో ఇప్పటికే ఏడు హాఫ్‌సెంచరీలు సాధించాడు. ఇంతకు ముందు 2016 సీజన్‌లో 11, 2023 సీజన్‌లో 8 అర్ధశతకాలు బాదాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రస్తుతం ఆర్సీబీ 17 పాయింట్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియన్ పేసరైన జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) తిరిగి జట్టులో చేరనున్నాడు. ప్లేఆఫ్స్ నేపథ్యంలో బెంగళూరుకు ఇది నిజంగా శుభవార్తే. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants) జరగనున్న మ్యాచ్‌లో మంచి నెట్‌రన్ రేట్‌తో విజయం సాధిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్‌ను (Punjab Kings) వెనక్కి నెట్టి మొదటిస్థానంలోకి దూసుకువెళ్లే అవకాశం ఉంది. 
 
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


