IPL 2023 : ఈ ఐపీఎల్ సీజన్‌లో మోస్ట్ బ్యాలెన్స్‌డ్ జట్టు అదే: సెహ్వాగ్
ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత సమతుల్యత కలిగిన జట్లలో లఖ్‌నవూ ఒకటని సెహ్వాగ్(Virender Sehwag) ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL 2023)లో లీగ్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. దీంతో జట్ల మధ్య ప్లేఆఫ్స్ రేసు తీవ్రంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023లో అత్యంత సమతుల్యత కలిగిన జట్టు ఏదో మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) చెప్పాడు. అయితే ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న గుజరాత్(Gujarat Titans) కాకపోవడం గమనార్హం.
లఖ్‌నవూ(Lucknow Supergiants) జట్టును మోస్ట్ బ్యాలెన్స్‌డ్ టీమ్‌గా సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘ఈ టోర్నీలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అత్యంత సమతుల్యత కలిగిన జట్లలో ఒకటని నేను అనుకుంటున్నాను. ఆ జట్టు బయటి మైదానాల్లో అద్భుతంగా రాణిస్తోంది. అయితే హోమ్ గ్రౌండ్‌లో ఆశించిన మేర ఆడటం లేదు’ అంటూ సెహ్వాగ్ ఓ ఛానల్‌తో విశ్లేషించాడు.
ఇక లఖ్‌నవూ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH vs LSG)తో ఉప్పల్ మైదానంలో జరిగిన కీలక పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఆరు విజయాలతో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబయి, కోల్‌కతాలతో తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్