Maldives Row: మన దగ్గరా అద్భుతమైన బీచ్‌లు.. సదుపాయాలు కల్పిస్తే చాలు: సెహ్వాగ్

లక్షద్వీప్‌ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు చేసిన విమర్శలను భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఖండించారు.

Updated : 11 Jan 2024 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లపై మాజీ క్రికెటర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయడం తగదని ‘ఎక్స్‌’ వేదికగా పోస్టులు పెట్టారు.

‘‘ఉడిపిలోని అందమైన బీచ్‌లు, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హేవ్‌లాక్ ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన దేశంలోనూ అందమైన బీచ్‌లు, అన్వేషించని చాలా ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆపదల నుంచి అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల మంత్రులు మన దేశం, ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా.. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని వసతులు సమకూర్చాలి. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసినట్లవుతుంది. మీకు ఇష్టమైన.. అందమైన ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పండి’’ - వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘నేను 15 ఏళ్ల వయసు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూనే ఉన్నా. ప్రతి దేశంలోనూ భారత హోటల్స్‌, పర్యాటక శాఖ అందించే సేవలు అద్భుతంగా ఉంటాయి. ఆయా దేశాల సంస్కృతిని గౌరవించేలా ఉంటాయి. ఇప్పుడు కొందరు భారత్‌పై నెగెటివ్‌ కామెంట్లు చేయడం బాధాకరం. నా మాతృభూమి ఆతిథ్యం ఎప్పుడూ బాగుంటుంది’’ - ఇర్ఫాన్‌ పఠాన్‌

‘లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రుల అక్కసు’

‘‘మాల్దీవుల ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు.. భారతీయులను బాధపెట్టేలా, వివక్ష చూపేలా ఉండటం బాధాకరం. నేను కూడా చాలాసార్లు అక్కడ పర్యటించా. అక్కడి అందాలు ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం. ఇటీవల సంఘటనల నేపథ్యంలో మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మన దేశంలోని ప్రదేశాల్లో సంబరాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయం’’ - సురేశ్‌ రైనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని