David Warner: ఆ మాట చెప్పినప్పుడు వార్నర్ నవ్వేశాడు: సెహ్వాగ్

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు (AUS vs IND) వార్నర్‌కు ఆఖరిది. వన్డేలు, టీ20లతో కెరీర్‌ను ప్రారంభించిన వార్నర్‌లో సుదీర్ఘ ఫార్మాట్ ఆడే నైపుణ్యం ఉందని గుర్తించిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag). ఇదే మాటను వార్నర్ కూడా ఓ సందర్భంలో వెల్లడించాడు.
‘‘2009 ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడేందుకు వార్నర్ వచ్చాడు. అప్పుడే టీ20లు, వన్డేలు ఆడటం మొదలు పెట్టాడు. అతడు ఆడేతీరును చూసి టెస్టు క్రికెట్‌లో రాణించగల సత్తా ఉందనిపించింది. కుర్రాడిగా ఉన్న వార్నర్‌కు మాత్రం అప్పుడు అర్థం కాలేదు. అతడికి తన నైపుణ్యంపై విశ్వాసం కుదరలేదు. టీ20 క్రికెట్‌లో వార్నర్ ఆట చూసిన తర్వాత టెస్టుల్లో ఇంకా బాగా ఆడతాడని అప్పుడే చెప్పా. ఇదే విషయాన్ని అతడికి చెబితే నవ్వడం ప్రారంభించాడు’’
‘‘నేను టెస్టు క్రికెట్‌కు చాలా దూరంలో ఉన్నా. ఆసీస్ జట్టులోకి రావాలంటే చాలా కష్టం’ అని అప్పుడు వార్నర్ నాతో చెప్పాడు. ‘సరే, ఇదే ఆటతీరును కొనసాగించు. టెస్టు క్రికెట్‌లో ఆడే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ సత్తా చూపిస్తావు. టీ20ల్లో కేవలం 20 ఓవర్లే ఆడాలి. అదే టెస్టుల్లో ఎంతసేపైనా ఆడొచ్చు’ అని నేను అన్నాను. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టి అద్భుతంగా రాణించాడు. నేను చెప్పిన మాటలను గుర్తు పెట్టుకుని ధన్యవాదాలు చెప్పాడు. టెస్టుల్లో ఇంకా కొనసాగితే బాగుండేది. ఇప్పుడు అతడి వయసురీత్యా ఆ ఫార్మాట్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


