USA vs PAK: యూఎస్‌ఏ చేతిలో ఓటమి.. ఇక నుంచి పాక్‌కు కష్టాలే: వసీమ్‌ అక్రమ్

పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీమ్‌ అక్రమ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో యూఎస్‌ఏ ప్రదర్శనను ప్రశంసించాడు.

Updated : 07 Jun 2024 14:26 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ఓటమి ఎదురైంది. యూఎస్‌ఏ సంచలన విజయం సాధించి ఆశ్చర్యానికి గురి చేసింది. సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించాడు. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో వెనుకబడిపోవడానికి కారణమేంటో చెప్పాడు. 

‘‘గెలవడం, ఓడిపోవడం అనేది గేమ్‌లో కామన్‌. చివరి బంతి వరకూ పోరాడటం మాత్రం అత్యంత ముఖ్యం. కానీ, యూఎస్‌ఏతో మ్యాచ్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. ఇదే పాక్‌ క్రికెట్‌కు కలిసిరాలేదు. సూపర్‌ 8కు వెళ్లాలంటే మా జట్టు చాలా శ్రమించాలి. ఇప్పటి నుంచి కష్టాలు మొదలైనట్లే. తదుపరి మ్యాచుల్లో భారత్ (జూన్ 9న)తో తలపడాల్సి ఉంటుంది. ఐర్లాండ్‌, కెనడాలతోనూ అంత తేలికేం కాదు. పాక్‌ త్వరగా వికెట్లను కోల్పోవడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌. యూఎస్‌ఏ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు.

పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌, షాదాబ్‌ మధ్య భాగస్వామ్యం రావడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగిలిన వారు రాణించలేదు. ఇక ఫీల్డింగ్‌లోనూ తేలిపోయారు. వీరి ఆటతీరు యావరేజీ కంటే తక్కువే అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రదర్శనే సరిగా లేదు. యూఎస్‌ఏతో ఆడేటప్పుడు నాతోపాటు మా జట్టు అభినులంతా గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం. తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత కూడా అలాంటి భావనే ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌ వచ్చేనాటికి యూఎస్‌ఏ దూకుడు పెరిగింది. ఆ జట్టు సూపర్‌ ఓవర్‌లో 19 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అది ప్రత్యర్థిపై ఒత్తిడిని గణనీయంగా పెంచే విషయం. ఆ జట్టు కెప్టెన్‌ మోనాంక్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డింగ్‌ కూడా బాగుంది. తప్పకుండా పాక్‌ మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి’’ అని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు