WPL 2024: అట్టహాసంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం.. టాస్‌ నెగ్గిన ముంబయి

రెండో ఎడిషన్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఘనంగా మొదలైంది. బాలీవుడ్ తారలు మైదానంలో చేసిన సందడి ఆకట్టుకుంది.

Updated : 23 Feb 2024 20:04 IST

ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్‌లో తొలి మ్యాచ్‌ గతేడాది ఫైనలిస్టులు ముంబయి ఇండియన్స్ - దిల్లీ క్యాపిటల్స్‌ (MI vs DC) జట్ల మధ్య మొదలైంది. టాస్‌ నెగ్గిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ మరీ చిన్నది కావడం విశేషం. లెగ్‌సైడ్ 50 మీటర్లు, ఆఫ్‌ సైడ్ కేవలం 60 మీటర్లు మాత్రమే ఉంటుంది. బెంగళూరు పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. ఇప్పుడు చిన్న బౌండరీలు కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉన్నారు. ముంబయికి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, దిల్లీ జట్టుకు సారథిగా మెగ్‌ లానింగ్‌ వ్యవహరిస్తోంది.

తుది జట్లు: 

ముంబయి ఇండియన్స్‌: హీలే మాథ్యూస్‌, నాట్ స్కివెర్‌ బ్రంట్, హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్, సజనా, పూజా వస్త్రాకర్, షబ్నిమ్‌ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్‌

దిల్లీ క్యాపిటల్స్‌: షఫాలీ వర్మ, మెగ్ లానింగ్‌ (కెప్టెన్), ఎలిస్‌ కాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్‌, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి,  మిన్ను మని, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్‌, షికా పాండే

అట్టహాసంగా ప్రారంభ వేడుకలు..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్‌ ప్రారంభమైంది. సినీ తారలు షారుఖ్‌ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్‌ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తింది. బాలీవుడ్ పాటలకు చేసిన డ్యాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నటి అర్చనా విజయ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తో పాటు మిగతా జట్ల సారథులను షారుఖ్‌ ఖాన్‌ పరిచయం చేశాడు. వీరిని ప్రత్యేక వాహనంలో మైదానంలో తిప్పడం విశేషం. అనంతరం స్టేజ్‌పై ఐదుగురు సారథులతో కలిసి షారుఖ్‌ స్టెప్పులు వేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఐపీఎల్‌ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు