MI vs DC: డబ్ల్యూపీఎల్‌-2024.. ముంబయికి దిల్లీ 172 పరుగుల లక్ష్యం

మహిళల ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) తొలి మ్యాచ్‌లోనే దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు హడలెత్తించారు. ముంబయి ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించారు.

Updated : 23 Feb 2024 21:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024) సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే క్రికెటర్లు అదరగొట్టేశారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ 172 పరుగులను టార్గెట్‌ నిర్దేశించింది. టాస్‌ నెగ్గిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఎలీస్ కాప్సే (75: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేసింది. ఓపెనర్‌, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ (31: 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌)తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ (42: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా పరుగులు రాబట్టారు. మరిజన్నె కాప్‌ (16: 9 బంతుల్లో 3 ఫోర్లు) వేగంగా ఆడింది. ముంబయి బౌలర్లు నాట్ స్కివెర్ బ్రంట్ 2, అమేలియా కెర్‌ 2, షబ్నిమ్‌ ఇస్మాయిల్ ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని