IND vs ENG: యశస్వి జైస్వాల్‌తోనే ఇంగ్లాండ్‌కు ప్రమాదం: మైఖెల్‌ వాన్‌

భారత్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు జైస్వాల్‌ నుంచే ప్రమాదం పొంచి ఉందని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ అన్నాడు.

Published : 10 Feb 2024 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు జైస్వాల్‌ నుంచే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించాడు. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా అతడితో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘యశస్వితో ఇంగ్లాండ్‌కు సమస్య అని చెబుతాను. అతడిని నేను ముంబయిలో కలిసిన మరుసటి రోజు ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. అద్భుతమైన ఆటగాడు. ప్రపంచంలో అత్యుత్తమ జట్టుపై ఇప్పుడు డబుల్ సెంచరీ సాధించాడు’’ అని వాన్‌ అన్నాడు.

గతేడాది వెస్టిండీస్‌ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జైస్వాల్‌ భారత్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఫిబ్రవరి 3న జరిగిన రెండో టెస్టులో డబుల్‌ సెంచరీ చేసి ఈ ఫీట్‌ సాధించిన మూడో అతిచిన్న వయసున్న భారతీయుడిగా నిలిచాడు. బ్యాటర్లు అందరూ విఫలమైనా ఇంగ్లాండ్ బౌలర్లను తట్టుకొని జైస్వాల్‌ 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209 పరుగులు చేశాడు.  మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 80 పరుగులు చేసిన జైస్వాల్‌ నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 80 సగటుతో 321 పరుగులు సాధించాడు.

Michael Vaughan

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని