Yashasvi: నేపాల్‌పై సెంచరీ.. శుభ్‌మన్‌ గిల్‌ రికార్డును అధిగమించిన యశస్వి

ఆసియా క్రీడలు తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో (IND vs NEP) భారత్‌ విజయం సాధించడానికి ప్రధానకారకుల్లో యశస్వి జైస్వాల్ ఒకడు. సెంచరీతో భారత్‌ భారీ స్కోరు చేసేందుకు సహకరించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Updated : 18 Jul 2024 15:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా (Team India) శుభారంభం చేసింది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు చేరుకుంది. అయితే, సెంచరీతో భారత విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 48 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు. దీంతో తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేయడంతోపాటు అరుదైన ఘనత సాధించాడు. మరో యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ పేరిట ఉన్న రికార్డును యశస్వి అధిగమించాడు. 

న్యూజిలాండ్‌పై ఇదే ఏడాది జనవరిలో గిల్ సెంచరీ కొట్టాడు. అప్పుడు అతడి వయసు 23 ఏళ్ల 146 రోజులు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ వయసు 21 ఏళ్ల 279 రోజులు కావడం విశేషం. దీంతో భారత్‌ తరఫున పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతయ క్రికెట్‌లో భారత్‌ నుంచి టీ20ల్లో సెంచరీ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నిలిచాడు. భారత్‌ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ కావడం విశేషం. యశస్వి 48 బంతుల్లో సెంచరీ కొట్టగా.. రోహిత్ శర్మ 35 బంతుల్లోనే వేగవంతమైన శతకం నమోదు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు