IND vs PAK: గెలిచినా.. ఓడినా పాక్‌ ఫ్యాన్స్‌ దృష్టంతా మనమీదే: యువరాజ్‌ సింగ్

టీ20 ప్రపంచ కప్‌ 2024లో భారత జట్టు ప్రయాణం జూన్ 5న ప్రారంభం కానుంది. ఆ రోజే ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇక జూన్ 9న దాయాది దేశం పాక్‌ను ఢీకొట్టనుంది.

Updated : 03 Jun 2024 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. కేవలం ఒక్కసారి మాత్రమే పాక్ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్‌ కప్‌లో (T20 World Cup 2024) ఇరుజట్లూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ వేదికగా (IND vs PAK) తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ రెండు టీమ్‌ల అభిమానులు గెలుపైనా.. ఓటమినైనా ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం యువీ టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

‘‘భారత్ - పాక్‌ మ్యాచ్‌ అంటేనే భావోద్వేగంతో కూడుకున్నదని అందరికీ తెలుసు. ఒకవేళ మనం గెలిస్తే.. మనవరకే సంబరాలు చేసుకుంటాం. ఓడితే మరోవిధంగా బాధపడతాం. కానీ, మనం గెలిచినా.. ఓడినా పాక్‌ అభిమానులు మాత్రం మనపైనే పడతారు. అదే ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కున్న వ్యత్యాసం. మ్యాచ్‌రోజు ఎవరైతే ఎమోషన్లను నియంత్రించుకోగలరో.. వారిదే 100 శాతం విజయం సాధించే అవకాశం ఉంటుంది. కేవలం గేమ్‌పైనే దృష్టి పెట్టాలి. గత కొన్నేళ్లుగా పాక్‌ కంటే భారత్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఇప్పుడు దానిని కొనసాగిస్తామని అనుకుంటున్నా’’ అని యువీ వ్యాఖ్యానించాడు. 

విరాట్ మరో ట్రైనింగ్‌ సెషన్స్‌ మిస్‌!

జట్టుతోపాటు కాకుండా ఆలస్యంగా అమెరికాకు చేరిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌ ఆడలేదు. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ట్రైనింగ్‌ సెషన్స్‌కు కోహ్లీ హాజరవుతాడని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన (741) విరాట్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకొన్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం అడుగుపెట్టే సమయంలోనే.. ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2023 అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని