Road Accidents: అధిక వేగంతోనే 84% ప్రమాదాలు

Eenadu icon
By Telangana News Desk Published : 04 Nov 2025 04:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

డ్రైవర్ల నిర్లక్ష్యంతో రక్తమోడుతున్న రహదారులు
2014 నుంచి 2.57 లక్షల ఘటనలు.. 83 వేల మరణాలు

వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ప్రమాదాలకు దారి   తీస్తున్నాయి... మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి... అనేక కుటుంబాల్ని రోడ్డుపాలు చేస్తున్నాయి... 2024లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 84 శాతం ఘటనలకు ఇవే కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2025 జులై వరకు తెలంగాణవ్యాప్తంగా 2.57 లక్షల ప్రమాదాలు జరిగాయి. 83 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

గుంతలను తప్పించే క్రమంలో....

నిర్వహణ లోపాలతో పలుచోట్ల రహదారులపై గుంతలు ఏర్పడుతున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనదారులు గుంతలు కనిపించగానే వాహనాన్ని పక్కకు తప్పిస్తున్నారు. కానీ, ఆ క్రమంలో వేగాన్ని తగ్గించడం లేదు. దీంతో పక్క నుంచి వెళ్లే, ఎదురుగా వచ్చే ఇతర వాహనాల్ని ఢీకొంటున్నారు. పలు రోడ్ల మధ్యలో డివైడర్‌ లేకపోవడంతో ముందు వెళ్తున్న వాహనాల్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొడుతున్నారు. ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వాహనాలు ఎక్కువ వేగంగా వెళ్తోంటే గుంతల్ని తప్పించే క్రమంలో అదుపులో ఉండటం లేదు.

ప్రధాన కారణాలు

  • అధిక వేగం, మద్యం తాగి నడపడం
  • ఓవర్‌ లోడ్, వాహనాల్లో నిర్వహణ లోపాలు
  • రోడ్లు సరిగ్గా లేకపోవడం, తగినన్ని లేదా అసలే సిగ్నళ్లు లేకపోవడం
  • ప్రతికూల వాతావరణం, ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనబడకపోవడం

ఏటేటా పెరుగుతున్నాయ్‌..

రాష్ట్రంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2014లో 20,078 జరగగా... 2019లో 21,570కి పెరిగాయి. 2024లో రికార్డుస్థాయిలో 25,986 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏటా సగటున 22 వేల మంది గాయపడుతున్నారు. దేశంలో ప్రమాదాల సంఖ్యలో రాష్ట్రం 8వ స్థానంలో, మరణాల్లో 10 స్థానంలో ఉండటం ప్రమాదాల తీవ్రతకు నిదర్శనం.

2024లో ప్రమాదాలు ఇలా.. (శాతాల్లో)

అధిక వేగంతో 84
రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ 4
డ్రంకెన్‌ డ్రైవింగ్‌ 2
ఇతర కారణాలు 10 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు