పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు స్థలాలు గుర్తించండి
మంత్రి పొంగులేటి
ఈనాడు, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టిసారించాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణాల్లో ఇళ్ల కోసం స్థలాలను గుర్తించాలన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ తదితర పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలి. రాష్ట్రంలో ఇప్పటికి 3 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఇందులో 1.23లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇంటి నిర్మాణ బిల్లులకు ఎదురుచూడకుండా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులను జమ చేస్తున్నాం. కేంద్రం మంజూరు చేసే వాటితో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం. దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వడం లేదు. గుడిసెలు లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 - 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 - 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 - 
                        
                            

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
 


