రెవెన్యూ భూముల లెక్కలు తీయండి.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్: గడిచిన 30, 40 ఏళ్ల నుంచి వివిధ అవసరాలకు రెవెన్యూశాఖ ఇతర శాఖలకు కేటాయించిన భూముల లెక్కలు తీయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ‘రెవెన్యూశాఖ గతంలో కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలి. ప్రధానంగా నీటిపారుదల, అటవీశాఖలకు పెద్ద ఎత్తున భూములు అప్పగించింది. రాష్ట్ర విభజన తరువాత కొన్ని ప్రాజెక్టులు రద్దయ్యాయి. మరికొన్నింటిలో మార్పు చేర్పులు జరిగాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల లెక్కలు తేల్చాలి. సీతారామ ఎత్తిపోతలకు ఉమ్మడి ఖమ్మంలో 1,138 ఎకరాల అటవీ భూముల కేటాయింపు ప్రక్రియలో వేగం పెంచాలి. కేశవాపురం తాగునీటి పథకం కోసం రెవెన్యూశాఖ అటవీశాఖకు 1,030 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు రద్దు అయినందున ఆ భూమిని సీతారామ ఎత్తిపోతలకు బదలాయించాలి’ అని మంత్రి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


