క్యాబినెట్‌కు హరీశ్‌ క్షమాపణ చెప్పాలి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హరీశ్, కేటీఆర్‌లను కేసీఆర్‌ అదుపులో పెట్టుకోవాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 

భారత రాష్ట్ర సమితి పాలనపై పోస్టర్లు విడుదల చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, నాగరాజు, అనిల్‌కుమార్‌యాదవ్‌ తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: కేసీఆర్‌కు తెలియకుండా హరీశ్‌రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు నిధులు సమకూర్చారని, అందుకే రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే హరీశ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు. హరీశ్‌ ఫండింగ్‌ చేశారని కవిత కూడా చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్‌ అని ఎలా అంటారని హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టూవర్టుపురం దొంగలా? అని నిలదీశారు. ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులతో కలిసి మంత్రి సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘దళితులు, బలహీనవర్గాలు ఉన్న రాష్ట్ర క్యాబినెట్‌ను హరీశ్‌రావు ఎలా అవమానిస్తారు? వ్యక్తిగత అంశాలు క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు రాలేదని దేవాలయంలో ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్‌ చేస్తే రాకుండా కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతున్నారు. ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చర్చకూ నేను సిద్ధమే. క్యాబినెట్‌కు హరీశ్‌ క్షమాపణలు చెప్పాలి. కేటీఆర్, హరీశ్‌రావులను కేసీఆర్‌ అదుపులో పెట్టుకోవాలి. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారు’ అని అడ్లూరి పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. నలుగురు ఎస్సీలు ఉన్న క్యాబినెట్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భారత రాష్ట్ర సమితిపాలనలో అవినీతి జరిగిందని, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని తదితర అంశాలపై పోస్టర్లు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు