త్వరలో తెలుగువర్సిటీల స్థిరచరాస్తులపై చర్చలు

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆచార్య మునిరత్నం నాయుడు

తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలు పొందిన వారితో ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య మునిరత్నం నాయుడు, ఎస్‌.రమేశ్‌ సుంకసారి, రింగు రామ్మూర్తి తదితరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన జరిగిన దశాబ్దం తరువాత ఇరు రాష్ట్రాల్లో తెలుగు విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పడటం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాల పేరిట 10 మంది ప్రముఖులను రూ.20,116 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించింది. బుధవారం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ఈ వేడుక జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మునిరత్నం నాయుడు మాట్లాడుతూ... త్వరలోనే ఇరు రాష్ట్రాల తెలుగువర్సిటీలకు సంబంధించిన స్థిరచరాస్తుల భాగస్వామ్యం గురించి చర్చలు ఉంటాయన్నారు  కార్యక్రమంలో తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, విశిష్ట అతిథి.. ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం కార్యక్రమ విభాగాధిపతి ఎస్‌.రమేశ్‌ సుంకసారి తదితరులు మాట్లాడారు. 31న ఉద్యోగ విరమణ పొందుతున్న విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకులు రింగు రామ్మూరిని వర్సిటీ ఉపాధ్యక్షులు ఘనంగా సత్కరించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

సాహితీ పురస్కార గ్రహీతలు వీరే: ధర్మపురి వైభవం(పద్య కవిత) వొజ్జల నరహరిశర్మ, నేను యౌగిక కావ్యం(వచన కవిత) విశ్వర్షి వాసిలి, తెలంగాణ రుబాయిలు(గేయ కవిత) డా.ఏనుగు నరసింహారెడ్డి, చందమామ చెప్పిన కథలు (బాలసాహిత్యం) డా.ఎం.హరికిషన్, ‘నా’ నుంచి ‘మన’ వరకు(కథ) డా.టి.సంపత్‌కుమార్, మాదిగ కొలువు(నవల) ఆచార్య పులికొండ సుబ్బాచారి, ద్విక్చక్రం(సాహిత్య విమర్శ) ఆడెపు లక్ష్మీపతి, రచ్చబండ(నాటకం) రావుల పుల్లాచారి, మృత్యుంజయుడు(అనువాదం) డా.టి.సి.వసంత, తిరుపతి కథలు(వచన రచన) ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి, స్వతంత్రత నుంచి స్వాతంత్య్రానికి(ఉత్తమ గ్రంథం) డా.జంధ్యాల కనకదుర్గ. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు