ఒక్క ఎకరా.. 400 రకాల వరిసాగు

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇక్కడి వరి పైరు చూశారా? ప్రతి పొలం ఇలాగే ఉంటుంది.. ఏముంది ఇందులో ప్రత్యేకం అంటారా? కనిపిస్తున్న పొలంలో ప్రతి 10 చదరపు మీటర్ల పరిధిలో ఉన్నది ఒక్కో విత్తన రకానికి చెందిన వరి. ఇలా పది, ఇరవై కాదు.. సుమారు 400 దేశవాళీ విత్తనాలు సేకరించి సాగుచేస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన రైతు, వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) యాదగిరి శ్రీనివాస్‌. 2016 నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విత్తనాలు సేకరించారు. శ్రీనివాస్‌కు మూడెకరాల భూమి ఉండగా రెండెకరాల్లో సాధారణ రకాలు, ఎకరంలో 400 రకాల విత్తనాలను సాగు చేస్తున్నారు. ప్రత్యేక ట్రేలలో నారు పెంచుతున్నారు. ప్రతి 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక్కో రకాన్ని నాటుతారు. పూర్తిగా జీవామృతంతోనే సాగు చేస్తున్నారు. వర్షాధారిత రకాలే కావడంతో వానాకాలంలో మాత్రమే సాగు చేస్తారు. అవసరం మేరకు విత్తనాలను భద్రపరుస్తారు. మిగిలిన విత్తనాలను కలిపి బియ్యంగా మారుస్తారు. ఏటా 15-20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆయన చెప్పారు. కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని క్వింటాలుకు రూ.8-10 వేల వరకు అమ్ముతున్నారు. ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా విత్తనాలు అందిస్తున్నారు.

న్యూస్‌టుడే, కమాన్‌పూర్‌(సెంటినరీకాలనీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు