Kavitha: 20 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. అవమానాలు ఎదుర్కొన్నా: కవిత

Eenadu icon
By Telangana News Team Published : 29 Sep 2025 20:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

లండన్‌: పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. లండన్‌లోని తెలంగాణ ప్రవాసులతో కవిత ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్‌ మోడల్‌గా నిలపాలన్నదే సంకల్పమని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందన్నారు. ‘‘అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతాం. ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంపై స్పష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం కూడా లేదు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ. అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. భాజపా డీఎన్‌ఏ నాకు సరిపడదు.

20 ఏళ్లు భారత రాష్ట్ర సమితి కోసం కష్టపడ్డాను. కొందరిలో స్వార్థం పురుడుపోసుకుంది. వారివల్ల కోట్లాది మంది బాధపడొద్దన్నదే నా తపన. పార్టీలో చీలికలు రావొద్దని ఎంత ఇబ్బందైనా తట్టుకొని నిలబడ్డాను. పార్టీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నా ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాటిపై స్పందించకపోతే తప్పవుతుంది. అందుకే మాట్లాడాల్సి వచ్చింది. పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టే.. పార్టీ ఇచ్చిన పదవిని వద్దనుకున్నాను. నిర్ణీత నమూనాలో రాజీనామా చేశాను. ఛైర్మన్‌ ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. నేను ఈ పరిస్థితికి రావడానికి అవతలి వాళ్లే కారణం. కష్టమవుతుందని తెలిసినా.. కేసీఆర్‌ బిడ్డగా ధైర్యంగా పంథాను ఎంచుకుంటాను. జైలు జీవితం నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది. సమూలంగా మార్చేసింది. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలి’’ అని కవిత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు