Kavitha: భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టి.రవీందర్‌రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు’’ అని భారత రాష్ట్ర సమితి పేర్కొంది. కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు.
కొంతకాలంగా భారత రాష్ట్ర సమితితో విభేదిస్తున్న కవిత.. ఎక్కువగా తెలంగాణ జాగృతి తరఫున నిర్వహించే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని.. తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత.. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కవిత వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది.

కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ విడుదల చేసిన ప్రకటన
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. - 
                                    
                                        

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ కారణం కాదు: ఆర్టీసీ ప్రకటన
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లక్కీ డ్రాలో భారతీయుడికి బంపర్ ఆఫర్
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


