అటు ఎండలు.. ఇటు వర్షాలు!

రాష్ట్రంలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ఎండలు హడలెత్తించగా.. పలుచోట్ల వర్షాలు కురిశాయి. 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి.

Published : 01 Apr 2023 04:49 IST

4 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ఎండలు హడలెత్తించగా.. పలుచోట్ల వర్షాలు కురిశాయి. 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. గరిష్ఠంగా నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లలో 41.6, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 41.2, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 40.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా జంకాపూర్‌లో 40 డిగ్రీలు నమోదైంది. మరోవైపు ములుగు జిల్లా మంగపేటలో 3.5, సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం రఘునాథపాలెంలో 2 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాగా శని, ఆదివారాల్లోనూ అక్కడక్కడ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని