హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు

తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. హైకోర్టు న్యాయవాదుల సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల లెక్కింపు శనివారం తెల్లవారుజామున పూర్తయింది.

Updated : 02 Apr 2023 05:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. హైకోర్టు న్యాయవాదుల సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల లెక్కింపు శనివారం తెల్లవారుజామున పూర్తయింది. అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో పల్లె నాగేశ్వరరావు.. తన సమీప ప్రత్యర్థి ఎ.జగన్‌పై 381 ఓట్లతో గెలుపొందారు. పల్లె నాగేశ్వరరావుకు 1120 ఓట్లురాగా, జగన్‌కు 739 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి చెంగల్వ కల్యాణ్‌రావు 303 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కార్యదర్శులుగా ప్రదీప్‌రెడ్డి, పులి దేవేందర్‌, క్రీడల విభాగ కార్యదర్శిగా కె.శారద, కోశాధికారిగా వి.పూర్ణశ్రీ, సంయుక్త కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌, కార్యనిర్వాహక సభ్యులుగా కె.శ్రీనివాసరావు, సి.సునీతకుమారి ఎన్నికయ్యారు.

ఎన్‌సీఎల్‌టీ బార్‌ అసోసియేషన్‌..: హైదరాబాద్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అధ్యక్షుడిగా బి.చంద్రసేన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అవినాశ్‌ దేశాయ్‌, కార్యదర్శిగా ఎల్‌.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఎస్‌.రాజశేఖర్‌రావు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లుగా బి.నిషిత, సి.తులసీ కృష్ణ, ఎ.వి.రోహన్‌ ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని