తెలంగాణలో ముంపు గ్రామాలపై సమాధానమివ్వండి

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సీతానగరం గ్రామవాసి తెల్లన్‌ నరేష్‌ ప్రధానమంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. ఆ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ను వివరణ కోరింది.

Published : 03 Jun 2023 04:09 IST

పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌కు పీపీఏ నిర్దేశం

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సీతానగరం గ్రామవాసి తెల్లన్‌ నరేష్‌ ప్రధానమంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. ఆ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ను వివరణ కోరింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల ప్రాంతాల్లోని అటవీప్రాంతం, గిరిజనులు రెండేళ్లుగా ముంపునకు గురవుతున్నా క్షేత్రస్థాయిలోని వాస్తవాలను అంచనా వేయడంలో అధికారులు విఫలమైనట్లు నరేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలవరం వెనుకజలాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, ఇళ్లు, ఆలయాలు ముంపునకు గురవుతున్నాయని కొన్ని ఫొటోలు జత చేశారు. ఈ ఫిర్యాదును ప్రధాని కార్యాలయం పీపీఏకు పంపింది. దీనిపై ఇది వరకే వివరణ కోరినప్పటికీ ఇంత వరకు బదులు రాలేదని కూడా ఆక్షేపించింది. దానిని పరిశీలించి ప్రభుత్వం తరఫు సమాధానాన్ని నేరుగా పిటిషనర్‌తోపాటు కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు, తమకు పంపాలని పీపీఏను నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని