Malla Reddy: నాపై అక్రమంగా కేసు పెట్టారు: హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 19 Dec 2023 09:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్‌ మండలం మూడుచింతపల్లి మండలం కేశవాపురం గ్రామంలో భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ కె.సురేందర్‌ ముందుకు విచారణకు రాగా ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని