Train: తర్వాతి స్టేషన్‌లో రైలు ఎక్కుతానంటే కుదరదు!

ఓ స్టేషన్‌ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్‌ చేయించుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్‌ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు.

Updated : 30 Jan 2024 09:09 IST

ఈనాడు-అమరావతి: ఓ స్టేషన్‌ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్‌ చేయించుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్‌ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు. రైలులో రిజర్వేషన్‌ వివరాలను ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)లు కొంత కాలంగా హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ (ట్యాబ్స్‌ వంటివి) ద్వారా పరిశీలిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్‌ అవుతాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్‌ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్‌ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయింటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించే వీలుంటుంది. దీంతో తర్వాత స్టేషన్‌లో రైలెక్కి నా బెర్త్‌ ఏదీ? అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు. గతంలో టీటీఈలకు ప్రింటెడ్‌ రిజర్వేషన్‌ జాబితా ఇచ్చేవారు. దీంతో ఒకటి, రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా వారు వేచి చూసేవారు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే.. బోర్డింగ్‌ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని