వేతనాలు లేవు.. సర్వీసు భద్రత కరవు

రెవెన్యూశాఖ నుంచి తమకు ఐచ్ఛికాలు కల్పించకుండా బలవంతంగా ఇతర శాఖల్లోకి మార్చి తీవ్ర అన్యాయం చేశారని పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 24 Feb 2024 02:58 IST

న్యాయం చేయాలని సీఎంకు పూర్వ వీఆర్వోల వినతి 

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూశాఖ నుంచి తమకు ఐచ్ఛికాలు కల్పించకుండా బలవంతంగా ఇతర శాఖల్లోకి మార్చి తీవ్ర అన్యాయం చేశారని పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సమీక్షించనున్న నేపథ్యంలో తమ కీలక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు పూర్వ వీఆర్వోల సంఘాలు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పలు సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచాయి. ‘ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో నెలల తరబడి వేతనాలు లేవు. మాతృశాఖలో ఉన్న సీనియారిటీని ఇప్పుడు పనిచేస్తున్న శాఖలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీఆర్వో వ్యవస్థ రద్దు నాటికి అర్హతలను బట్టి పదోన్నతి కల్పించలేదు. రెవెన్యూశాఖలో మిగులు సిబ్బందిగా నిర్ధారించి ‘రీడిప్లాయిమెంట్‌’ విధానంలో బదలాయించి కేడర్‌, సేవల కేటాయింపును ఇష్టారీతిన చేశారు. ఇతర శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ తత్సమాన పోస్టుల్లో నియమించాల్సి ఉండగా తోటమాలి, వార్డు ఆఫీసర్‌, రికార్డు అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, హాస్టల్‌ వర్కర్లుగా నియమించారు’ అని పేర్కొన్నారు. సీఎం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని