గురుకుల డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ఫలితాల వెల్లడి

సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు బుధవారం ప్రకటించింది.

Published : 29 Feb 2024 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు బుధవారం ప్రకటించింది. మొత్తం 22 సబ్జెక్టుల వారీగా జాబితాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అలాగే గురుకులాల్లో 1924 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తిచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని