పసుపు పంటకు రికార్డు ధర

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈ సీజన్‌లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి.

Updated : 29 Feb 2024 03:48 IST

నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటా రూ.14,255

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈ సీజన్‌లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల కొమ్ముకు గరిష్ఠంగా క్వింటాకు రూ.14,255 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్‌ అత్యధిక ధరగా మార్కెటింగ్‌ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి వెంకటేశం వెల్లడించారు. పదమూడేళ్లకు మళ్లీ పసుపు పంటకు డిమాండ్‌ వచ్చింది. 2011లో క్వింటా ఆల్‌టైమ్‌ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత రూ.6-7 వేల మధ్య మాత్రమే లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని