TS Inter Exams: ఇక నుంచి అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను ఆదేశించింది.

Updated : 02 Mar 2024 07:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. ఇంతవరకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా హాజరైనా పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో అయిదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించాలని ఇంటర్‌ విద్యాబోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

మార్చి 4వ తేదీ నుంచి మూల్యాంకనం

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఇంటర్‌ విద్యాబోర్డు తెలిపింది. ఈ నెల 24 వరకు దానిని నిర్వహిస్తామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు