కదులుతున్న రైళ్లు ఎక్కడం, దిగడం నేరం: ద.మ.రైల్వే

రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని, ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని ద.మ.రైల్వే హెచ్చరించింది.

Updated : 20 Mar 2024 08:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని, ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని ద.మ.రైల్వే హెచ్చరించింది. భద్రత విషయంలో రైల్వేశాఖకు సహకరించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

  • రైలు బయలుదేరే సమయంలో, స్టేషన్‌ చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కొద్దు. దిగే ప్రయత్నం చేయొద్దు.
  • నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు.
  • ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, సబ్‌వేలు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీలను వాడాలి.
  • ట్రాక్‌ల దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించొద్దు.
  • రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాలలో సెల్ఫీ, ఫొటోగ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉంది.
  • భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్‌ 147 ప్రకారం రైల్వే ట్రాక్‌ను దాటడం చట్టరీత్యా నేరం. ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి వరకు జరిమానా. లేదా రెండు శిక్షల విధింపు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని