న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్‌ చిత్రం ప్రదర్శన

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ నలిమెల అరుదైన ఘనత సాధించారు.

Published : 28 Mar 2024 05:21 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటో అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై మెరిసింది. ఎన్‌ఎఫ్‌టీఎన్‌వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫొటోలు పోటీ పడగా, తాను తీసిన చిత్రం పోటీలో ఎంపికై న్యూయార్క్‌ టైం స్క్వేర్‌ బిల్‌బోర్డుపై మంగళవారం రాత్రి నుంచి ప్రదర్శితమవుతున్నట్లు తెలిపారు.

నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని, తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్‌ ఫొటోగ్రఫీ పోటీల్లోనూ ఆయన ఇటీవల బహుమతి అందుకున్నారు. గత డిసెంబర్‌లో ప్రధాని మోదీ అరుణ్‌కుమార్‌ తీసిన ఫొటోల గురించి మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని