పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి.

Published : 28 Mar 2024 03:46 IST

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మంగళిబండ తండాలో రైతు గుగులోతు పూల్‌సింగ్‌ మూడు ఎకరాల వరి పంట నీళ్లు లేక ఇలా ఎండిపోయింది. పెట్టుబడి కోసం రూ.75 వేలు అప్పు చేశామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొస్తాయనుకున్న కాస్త తిండిగింజలూ ఎండి ఇలా పశువులకు దాణాగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇక్కడి రైతులందరిదీ ఇదే పరిస్థితి. భూగర్భజలాలు పాతాళంలోకి చేరి చేయూత కరవై కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, రఘునాథపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని