బకాయి నిధులు విడుదల చేయించాలి

చేనేత వస్త్రాలను సేకరించి ఏడాది గడుస్తున్నా..ఇప్పటివరకు వాటికి సంబంధించిన బకాయి నిధులను రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) విడుదల చేయడంలేదని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేనేత సంఘాల కార్మికులు ఫిర్యాదు చేశారు.

Updated : 30 Mar 2024 04:29 IST

మంత్రి తుమ్మలకు చేనేత కార్మికుల ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: చేనేత వస్త్రాలను సేకరించి ఏడాది గడుస్తున్నా..ఇప్పటివరకు వాటికి సంబంధించిన బకాయి నిధులను రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) విడుదల చేయడంలేదని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేనేత సంఘాల కార్మికులు ఫిర్యాదు చేశారు. టెస్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు నేతృత్వంలో చేర్యాల, ఇతర చేనేత సంఘాల కార్మికులు శుక్రవారం తుమ్మలను ఆయన నివాసంలో కలిశారు. టెస్కో నిధులివ్వకపోవడంతో వేతనాల చెల్లింపులు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికితీసుకెళ్లారు. టెస్కో ఎండీతో మాట్లాడి వెంటనే నిధులను విడుదల చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని