సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద శనివారం ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Published : 31 Mar 2024 03:13 IST

భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తగా గుర్తింపు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద శనివారం ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి అతనిపై నీరు పోయడంతో ప్రమాదం తప్పింది. ఆపై అతన్ని జూబ్లీహిల్స్‌ ఠాణాకు తరలించారు. విచారణలో అతడిని భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త కృష్ణసాగర్‌గా గుర్తించారు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో పార్టీ గెలుపు కోసం పని చేశానని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా తనకు ఎలాంటి పదవులు దక్కలేదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది భరించలేక సీఎం ఇంటి వద్దే చనిపోవాలని ప్రయత్నించానని చెప్పాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని