జస్టిస్‌ పీసీ ఘోష్‌తో నేడు అధికారుల భేటీ

కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కలిసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం కోల్‌కతా వెళ్లారు.

Published : 02 Apr 2024 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కలిసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం కోల్‌కతా వెళ్లారు. శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఓ అండ్‌ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌ మంగళవారం జస్టిస్‌ ఘోష్‌తో భేటీకానున్నారు. విచారణకు సంబంధించిన ఉత్తర్వులు, కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల సమాచారాన్ని ఆయనకు అందజేసి వివరించనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని