పడిపోతున్న నిల్వ.. పొంచిఉన్న తాగునీటి కొరత..!

మిషన్‌ భగీరథ పథకానికి కీలకమైన దిగువ మానేరు జలాశయం(ఎల్‌ఎండీ)లో నీరు అడుగంటుతుండడంతో కరీంనగర్‌ జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది.

Published : 02 Apr 2024 05:14 IST

మిషన్‌ భగీరథ పథకానికి కీలకమైన దిగువ మానేరు జలాశయం(ఎల్‌ఎండీ)లో నీరు అడుగంటుతుండడంతో కరీంనగర్‌ జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. ఇప్పటికే నగరంలో నీటి సరఫరాలో కోతలు విధిస్తుండగా.. ఎండలు మరింత తీవ్రమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌ఎండీ జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరో 1.20 టీఎంసీల నీరు మధ్యమానేరు నుంచి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు.

ఈనాడు కరీంనగర్‌- న్యూస్‌టుడే తిమ్మాపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని