సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రతిభ చూపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరకు రవాణాతో పాటు ఆదాయాన్నీ ఆర్జించింది.

Published : 02 Apr 2024 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రతిభ చూపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరకు రవాణాతో పాటు ఆదాయాన్నీ ఆర్జించింది. తొలిసారిగా సరకు రవాణాలో 140 మెట్రిక్‌ టన్నుల మార్కును దాటి 141.117 మెట్రిక్‌ టన్నుల రికార్డు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2022-23 ఏడాదితో పోల్చితే ఇది 8.7 శాతం అధికమని వివరించింది. గతేడాది కంటే రూ.506 కోట్లు అదనంగా సమకూరినట్లు తెలిపింది. ఈ మేరకు మొత్తం రూ.13,438.76 ఆదాయాన్ని పొందినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. జోన్‌ పరిధిలోని ఆరు డివిజన్ల పనితీరుతో ఈ రికార్డు సాధ్యమైనట్లు వెల్లడించింది. రైల్వే సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే వాటా 11.18 శాతంగా ఉంది. సరకు రవాణాలో అగ్రస్థానంలో బొగ్గు (70.52 మెట్రిక్‌ టన్నులు), రెండోస్థానంలో సిమెంట్‌ (36.117 మెట్రిక్‌ టన్నులు) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని