నిబంధనలను అతిక్రమిస్తే అపరాధ రుసుము

అనుమతులు లేకుండా ముందస్తు విక్రయాలు (ప్రీలాంఛింగ్‌) చేపట్టిన పక్షంలో ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మొత్తాన్ని అపరాధ రుసుంగా విధిస్తామని తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి పి.యాదిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 02 Apr 2024 03:43 IST

బిల్డాక్స్‌కు గుండ్లపోచంపల్లిలోనే రెరా అనుమతి 

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతులు లేకుండా ముందస్తు విక్రయాలు (ప్రీలాంఛింగ్‌) చేపట్టిన పక్షంలో ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మొత్తాన్ని అపరాధ రుసుంగా విధిస్తామని తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి పి.యాదిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 27 ప్రాజెక్టుల నుంచి రూ.21 కోట్లు అపరాధ రుసుముగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. తాము జారీ చేసే ఉత్తర్వులకు చట్టబద్ధత ఉందన్నారు. ‘బిల్డాక్స్‌ రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో షోకాజ్‌ నోటీసు జారీచేశాం. ఈనెల 4న విచారణ నిర్వహించనున్నాం. ఈ సంస్థ వ్యవహారం ఇంకా రెరా పరిధిలోనే ఉందని’ పేర్కొన్నారు. హైదరాబాద్‌ శివారులోని గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబరు 509 పార్టులో భువి వాసవి బిల్డాక్స్‌ ప్రాజెక్టుకు మాత్రమే రెరా అనుమతి తీసుకుంది. ఇతర ప్రాంతాల్లో ఈ పేరుతో ఆ సంస్థ నిర్వహించే ఏ ఇతర ప్రాజెక్టుకూ అనుమతి లేదని తెలిపారు. అనుమతులు లేని బిల్డాక్స్‌ సంస్థతో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని తెలిపారు. 9,217 ప్రాజెక్టులు అనుమతుల కోసం రాగా ఇప్పటివరకు 8,003 ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేశామన్నారు. 3,765 మంది ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 3,621 మంది రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని యాదిరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని