ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. 1153 మందికి నోటీసులు

ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 1,153 మంది అధికారులపై హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్‌రాస్‌ చర్యలు తీసుకున్నారు

Published : 02 Apr 2024 03:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 1,153 మంది అధికారులపై హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్‌రాస్‌ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధులను తెలియజేసేందుకు ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో 6 వేల మంది ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌(పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌(ఏపీఓ)లకు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన శిక్షణ తరగతులకు చాలా మంది గైర్హాజరవడంతో రోనాల్డ్‌రాస్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎందుకు రాలేకపోయారో వివరణ ఇవ్వాలని అధికారులకు తాఖీదులు పంపారు. మున్ముందు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని రోనాల్డ్‌రాస్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు