నాగర్‌కర్నూల్‌ ఎస్‌ఈ విజయ్‌ భాస్కర్‌కు సీఈ బాధ్యతలు

నాగర్‌కర్నూల్‌ నీటిపారుదల సర్కిల్‌ సీఈ బాధ్యతలను(ఎఫ్‌ఏసీ) అక్కడే పర్యవేక్షక ఇంజినీరు(ఎస్‌ఈ)గా పనిచేస్తున్న విజయ్‌ భాస్కర్‌కు ప్రభుత్వం అప్పగించింది.

Published : 03 Apr 2024 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ నీటిపారుదల సర్కిల్‌ సీఈ బాధ్యతలను(ఎఫ్‌ఏసీ) అక్కడే పర్యవేక్షక ఇంజినీరు(ఎస్‌ఈ)గా పనిచేస్తున్న విజయ్‌ భాస్కర్‌కు ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించిన దస్త్రంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసినట్లు తెలిసింది. మార్చి 31వ తేదీ వరకు సీఈగా విధులు నిర్వర్తించిన అహ్మద్‌ ఖాన్‌ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరోసారి పదవీ కాలం పొడిగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ..సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని