ఉపాధి హామీలో వందశాతం సామాజిక తనిఖీ

రాష్ట్రంలో 2022-23లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ వందశాతం పూర్తయింది.

Published : 03 Apr 2024 02:59 IST

2022-23 సంవత్సరానికి నిర్వహణ
ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ వందశాతం పూర్తయింది. 540 మండలాల్లో 12769 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులను తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ పరిశీలించింది. దేశంలో వందశాతం సామాజిక తనిఖీ పూర్తయిన రాష్ట్రాలుగా కేరళ, తెలంగాణ నిలిచాయి. ఇంటింటికి వెళ్లి కూలీలకు చెల్లించి వేతనాలతో పాటు కలిగిన లబ్ధి, చేపట్టిన పనులను పరిశీలించింది. జిల్లా, మండల పరిషత్‌లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల అధికారులు దీనికి సహకరించారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా తెలిపారు. సామాజిక తనిఖీలో 2.85 లక్షల ఆర్థిక, ఆర్థికేతర పనులు జరిగాయని, వేతనాల చెల్లింపులు, పని ప్రదేశాల్లో వసతులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించామని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా సామాజిక తనిఖీని పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని