నిబంధనలు పాటించని వైద్యులు, ఆసుపత్రులపై చర్యలు

రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు.. రిజిస్ట్రేషన్‌ సంఖ్య, కన్సల్టెంట్‌ డాక్లర్ల పేర్లను విధిగా బోర్డులపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎంసీ) ఛైర్మన్‌ కె.మహేశ్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 11 Apr 2024 03:54 IST

రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు.. రిజిస్ట్రేషన్‌ సంఖ్య, కన్సల్టెంట్‌ డాక్లర్ల పేర్లను విధిగా బోర్డులపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎంసీ) ఛైర్మన్‌ కె.మహేశ్‌కుమార్‌ ఆదేశించారు. చాలా ఆసుపత్రులు బోర్డులపై గుర్తింపు సంఖ్యను ప్రదర్శించడం లేదని, కొన్ని ఆసుపత్రుల్లో ఫార్మా-డీ డిగ్రీ కలిగిన వారిని డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ, రోగుల కేస్‌ షీట్లను రాసే బాధ్యతలను అప్పగిస్తున్నట్లు గుర్తించామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చాలా ఆసుపత్రులు ఆయుష్‌ డాక్టర్లను డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నాయని ఇది నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యులు రాష్ట్రంలో మెడికల్‌ కౌన్సిల్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. కొందరు వైద్యులు రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేసుకోకుండానే ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిబంధనలు పాటించని వైద్యులు, ఆసుపత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని