ఐదేళ్ల కనిష్ఠానికి సాగర్‌ జలాశయం

నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది కృష్ణా పరీవాహక ఎగువ ప్రాంతంలో వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో సాగర్‌ జలాశయం గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా 510.70 అడుగుల కనీస నీటిమట్టానికి తగ్గిపోయింది.

Published : 11 Apr 2024 03:55 IST

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది కృష్ణా పరీవాహక ఎగువ ప్రాంతంలో వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో సాగర్‌ జలాశయం గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా 510.70 అడుగుల కనీస నీటిమట్టానికి తగ్గిపోయింది. డ్యాంలో నీరు లేకపోవడంతో ప్రభుత్వం రైతులను వరి సాగు చేయవద్దని ప్రకటించడంతో పంట సాగు చేయలేదు. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో నీటి నిల్వను పరిశీలిస్తే మే నెలలో తాగునీటిని అందించడం కూడా కష్టంగా కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి కోసం జలాశయంలో నీటిని 505.00 అడుగుల మట్టానికి వచ్చే వరకు విడుదల చేయాలన్న ఆలోచనలో కేఆర్‌ఎంబీ ఉన్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నానికి జలాశయంలో 510.70 అడుగుల నీరుండగా, ఇది 132.86 టీఎంసీలకు సమానం. (సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590.00 అడుగులు. ఇది 312.5050 టీఎంసీలకు సమానం).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని