ఎమ్మెల్యేకు మాజీ సీఎం కేసీఆర్‌ పరామర్శ

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తండ్రి హన్మంతరావు మృతిచెందగా బుధవారం 13వ రోజు కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.

Published : 11 Apr 2024 03:55 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తండ్రి హన్మంతరావు మృతిచెందగా బుధవారం 13వ రోజు కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా హన్మంతరావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు,జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత,  భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, నిజామాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీమంత్రి రాజేశంగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని