20వ తేదీ తర్వాతే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది.

Published : 13 Apr 2024 05:10 IST

ఇప్పటికే మూల్యాంకనం పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని