అట్టహాసంగా గరుడాధివాసం పూజలు

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆదివారం గరుడాధివాసం నిర్వహించారు.

Published : 15 Apr 2024 04:56 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆదివారం గరుడాధివాసం నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజపటాన్ని జీయర్‌స్వామి మఠం వద్ద లిఖించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా గరుత్మంతుడు రక్షగా ఉంటాడని దేవనాథ రామానుజ జీయర్‌స్వామి తెలిపారు. ఈ పటాన్ని మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ ఆలయానికి తీసుకొచ్చి అక్కడ ఉంచడాన్ని అధివాసంగా పేర్కొన్నారు. అగ్ని సమీకరణ క్రతువు భక్తిప్రపత్తులను చాటింది. గరుడమూర్తికి పొంగలిని ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ వేడుకతో పాటు భేరి పూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠాపన ఉంటుంది. సోమవారం ధ్వజారోహణం చేస్తారని ఈవో రమాదేవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని