బాలలకు వైద్య సాయం అందిస్తాం

నడవలేని స్థితిలో ఉన్న ముగ్గురు బాలలకు సాయం అందిస్తామని రఘు అరికపూడి సేవా ట్రస్టు సంస్థ ఛైర్మన్‌ రఘు తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లికి వచ్చిన ఆయన పుట్టుకతో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు సోదరులను పరామర్శించారు.

Published : 15 Apr 2024 03:28 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

కట్టంగూరు, న్యూస్‌టుడే: నడవలేని స్థితిలో ఉన్న ముగ్గురు బాలలకు సాయం అందిస్తామని రఘు అరికపూడి సేవా ట్రస్టు సంస్థ ఛైర్మన్‌ రఘు తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లికి వచ్చిన ఆయన పుట్టుకతో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు సోదరులను పరామర్శించారు. వారికి మందులు అందజేశారు. బొల్లెపల్లికి చెందిన పుట్ట నర్సింహ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. జన్యుపరమైన వ్యాధి కారణంగా వీరికి ఎముకలు ఎదగలేదు. నడవలేని స్థితిలో ఉన్న వీరిని తల్లిదండ్రులే మోయాల్సిన పరిస్థితి. ముగ్గురు పిల్లలను గత శుక్రవారం నిమ్స్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. వీరి ఆరోగ్య స్థితిపై ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘నవమాసాలు కాదు.. నయమయ్యే వరకూ మోయాల్సిందే’ శీర్షికన శనివారం కథనం ప్రచురితమైంది. రఘు స్పందించి బాలలకు వైద్య పరీక్షలు, మందులకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ ‘హోప్‌ 4 స్పందన’ సహకారంతో నర్సింహ వ్యాపారం చేసుకునేందుకు రూ.1.50 లక్షలు అందిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని