సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

Published : 18 Apr 2024 03:41 IST

ఈఎన్సీపై ప్రభుత్వ వర్గాల ఆగ్రహం..!

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ) అనిల్‌కుమార్‌ ఇటీవల గుత్తేదారు సంస్థలతో సమావేశం నిర్వహించడం, ఆ వెంటనే మరమ్మతులకు నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు రావడంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్‌ఏ అధ్యయనం చేస్తుండగా.. ఇప్పటి వరకు సిఫార్సులేవీ చేయలేదు. విజిలెన్స్‌ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈఎన్సీ ఏ విధంగా మరమ్మతులకు నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై వివరణ కూడా కోరినట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈఎన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని