భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ

రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Published : 19 Apr 2024 04:08 IST

రైతులకు అందుబాటులోకి సేవలు
మంత్రి తుమ్మల ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం భూసార పరీక్ష కేంద్రాలపై ఆయన తమ నివాసంలో సమీక్ష నిర్వహించారు. 2021 నాటికి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 9 పరీక్ష కేంద్రాలు, ప్రాంతీయ భూసార పరీక్షకేంద్రం ఒకటి, సంచార భూసార పరీక్షా కేంద్రం మరొకటి, మార్కెట్‌ యార్డుల్లో 14 భూసార పరీక్షా కేంద్రాలు పనిచేశాయని ఆ తర్వాత వాటిని మూసి వేశారని తెలిపారు. ప్రస్తుతం పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి తేవడం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వచ్చే వానాకాలంలోపు మినీ సాయిల్‌ టెస్టింగ్‌ కిట్‌లను రైతు వేదికలలో సహకార సంఘాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని