జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు

హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్‌-విస్‌బాడెన్‌లో భారత్‌ వాసి జర్మనీ అసోసియేషన్‌ ఘనంగా వేడుకలు నిర్వహించింది.

Published : 19 Apr 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్‌-విస్‌బాడెన్‌లో భారత్‌ వాసి జర్మనీ అసోసియేషన్‌ ఘనంగా వేడుకలు నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాంక్‌ఫర్ట్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా బీఎస్‌ ముబారక్‌ హాజరయ్యారు. ఉగాదిని భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్వహించుకుంటారనే విషయాన్ని తెలియజేస్తూ మహిళలు, చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రాలు ధరించి నిర్వహించిన ఫ్యాషన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాలు జర్మన్లను ఆకట్టుకున్నాయని అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాంబాబు సూరబత్తుల, కోర్‌కమిటీ సభ్యులు లోగేశ్‌ రామమూర్తి, అనిల్‌ బత్తిని, సుధాకర్‌ తాడికొండ, మధు అవునూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని